వికెట్ల వెనుక ధోని ఎంత వేగంగా కదులుతాడో మనందరికీ తెలిసిందే. వికెట్ల వెనుక ధోని ఉండగా క్రీజు దాటారంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఐపీఎల్ టోర్నీలో భాగంగా పూణె వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ధోని మరోసారి తన కీపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
క్రీజులో చక్కటి పుట్ వర్క్‌ను కనబర్చే ఏబీ డివిలియర్స్‌ను ధోని తన స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. హర్భజన్ సింగ్ వేసిన 8 ఓవర్ మూడో బంతికి ఏబీ క్రీజు దాటి రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు తగలకుండా ధోని చేతిలో పడింది. ఇంకేముంది రెప్పపాటులో బంతిని ధోని వికెట్లను గిరాటేశాడు.
Royal Challengers Bangalore could not offer answers to the questions the spinners of Chennai Super Kings asked and were bundled out for 127/9 in 20 overs here on Saturday (May 5).